పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నకోడూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

పోలవరం ఐదేళ్లలో పూర్తవడం గొప్పే అన్నారంటూ హరీశ్

పోలవరం ఐదేళ్లలో పూర్తవడం గొప్పే అన్నారంటూ హరీశ్

ఢిల్లీలో, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుందని.. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు కళ్లకు కనిపిస్తాయన్నారు హరీశ్ రావు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మరో ఐదేళ్లయినా పూర్తి చేయలేరన్నారు.పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడా. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.. మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని చెప్పారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పోలవరం ఇంకా పూర్తి కాలేదంటూ హరీశ్ రావు

పోలవరం ఇంకా పూర్తి కాలేదంటూ హరీశ్ రావు

కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. కానీ, కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదు. ఆ ఫలితం ప్రజలకు అందలేదు. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న మనం ఆ అబద్ధాలను తిప్పికొట్టి.. కాళేశ్వరం గొప్పతనాన్ని చాటిచెప్పాలి అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 10 ఎకరాల భూమి వస్తుందన్నారు.

మోడీ కన్నా కేసీఆర్ బలమే ఎక్కువ పెరిగిందన్న హరీశ్ రావు

మోడీ కన్నా కేసీఆర్ బలమే ఎక్కువ పెరిగిందన్న హరీశ్ రావు

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అన్నారన్న హరీశ్ రావు.. మరి బీజేపీ నేతల టన్నుల కొద్ది తిట్లు కేసీఆర్‌ని ఎంత బలవంతుడిని చేసి ఉంటాయని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పీఎం దేశానికి, తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఏం చేశారని అడిగితే తిడుతున్నారని చెబుతూ పలాయనం చేయడం ఎంత వరకు భావ్యం మోడీజీ అంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+