ఈటెలకు తప్పిన ముప్పు, సీటు బెల్ట్‌వల్లే: కారు 5పల్టీలు (పిక్చర్స్)
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ కారు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
లారీనీ దాటేయబోయి కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఈటెల కాలుకు స్వల్ప గాయం అయింది. గన్‌మెన్, డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఇద్దరు పీఏలకు గాయాలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు ఈటెలను పరామర్శించారు.

ప్రమాదం
శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు ముగించుకొని కరీంనగర్‌కు వస్తున్నారు.

ప్రమాదం
ఈ క్రమంలో మానకొండూర్ మండలం ఈదులగట్టేపల్లి వద్ద ఈటల పయనిస్తున్న ఫార్చూనర్ వాహనం ఓవర్‌టేక్ చేస్తుండగా టిప్పర్ ఢీకొన్నది.

ప్రమాదం
దీంతో మంత్రి వాహనం అయిదు పల్టీలు కొట్టింది. వాహనంలో మంత్రితో పాటు ఆయన పీఏలు ముకుంద రెడ్డి, చంద్రమౌళి, గన్‌మెన్ వెంకటేశ్వర్లు, డ్రైవర్ రఫీక్ ఉన్నారు.

ప్రమాదం
అంతా సీటు బెల్టులు ధరించడం, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మంత్రి తలకు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం
వెంటనే కాన్వాయ్‌లోని పోలీసులు, స్థానికులు వాహనం అద్దాలను బద్దలుగొట్టి అందరినీ బయటకు తీశారు.

ప్రమాదం
హుటాహుటిన కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈటెలకు ఎటువంటి ప్రమాదం లేదని, స్వల్ప గాయాలేనని వైద్యులు తేల్చారు.

ప్రమాదం
పీఏ ముకుందరెడ్డి, డ్రైవర్ రఫీక్ తలలకు బలమైన గాయాలు కావడంతో అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం
మరో పీఏ చంద్రమౌళి, గన్‌మెన్ వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం మంత్రి సహా అందరిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఆయన ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ఈటలతో ఫోన్‌లో మాట్లాడారు.

ప్రమాదం
ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈటెల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications