అప్పులపై సవాళ్లు, తేల్చిన లెక్క ఇలా- ఎవరి హయాంలో ఎంత..!!
తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. అప్పుల వ్యవహారం పై మంత్రులు- బీఆర్ఎస్ నేతల మధ్య రెండు రోజులు ఛాలెంజ్ ల పర్వం కొనసాగుతోంది. చర్చకు సిద్దమంటూ ఒకరిని మరొకరు సవాల్ చేసారు. కాగా, ఈ వ్యవహారం పైన తాజాగా కేబినెట్ భేటీలోనూ చర్చ జరిగింది. సవాల్ చేసినప్పుడు చర్చ చేయాలని సీఎం రేవంత్ సైతం సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా.. మంత్రులు ఇప్పుడు అప్పుల లెక్కలు బయట పెట్టారు. ఈ చిట్టా పైన హరీష్ స్పందించారు. కొత్త లెక్కలు బయటకు తెచ్చారు. దీంతో.. అసలు ఎవరి హయాం లో ఎంత అప్పు అనేది స్పష్టత వస్తోంది.
మంత్రులు- బీఆర్ఎస్ మధ్య సాగుతున్న సవాళ్లలో రాష్ట్ర అప్పుల పైన చర్చ మొదలైంది. ఆర్దిక మంత్రి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం అప్పు రూ.8.21 లక్షల కోట్లు అని.. మొత్తం అప్పుల్లో గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని తెలిపారు. అప్పులు అన్నీ వాస్తవాలు కాదా.. వీటిని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులను తక్కువ చేసి చూపేందుకే కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయం లో అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు. అప్పులపై మంత్రి, ముఖ్యమంత్రి మాటలు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పులపై అసెంబ్లీలో తాను మాట్లాడిన వీడియో, ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో జూపల్లికి పంపినట్లు చెప్పారు. కాగా.. మంత్రి లెక్క ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు రూ.1.77 లక్షల కోట్లు అని.. RBI లెక్కల ప్రకారం రూ.1.86 లక్షల కోట్లు అని తెలిపారు.

ఎవరి హయాంలో ఎంత
అదే విధంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రూ.3.47 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. నిన్న తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పింది జూపల్లే అని.. మాటమార్చి గన్‌పార్క్‌కు వెళ్లారన్నారు. గన్‌పార్క్‌కు రాకుండా తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. చర్చకు కేసీఆర్ రావాలని ఇప్పుడు అంటున్నారని తెలిపారు. మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్ గోల్ అయ్యారని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇక.. మరోసారి మంత్రి జూపల్లి మాట్లాడారు. 'నేనెక్కడికీ పారిపోలేదు. పారిపోయే లక్షణం నాకు లేదు. నా మాటకు కట్టుబడి ఉన్నాను. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్‌లాగా కేటీఆర్, హరీశ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అప్పు రూ.3,17,015 కోట్ల అని ఒకసారి, రూ.3,85,045 కోట్లు అని మరోసారి అసెంబ్లీలో కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అప్పు రూ.4, 26,499 కోట్లు అని ఒకసారి.. రూ.4,17, 496 కోట్లు అని మరోసారి హరీశ్ అసెంబ్లీలో అన్నారు. కేసీఆర్ దిగిపోయే సరికి రూ.8,21, 651 కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. నేను చెప్తున్న లెక్కలు తప్పు అయితే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications