తప్పుడు ప్రచారం మానుకోవాలి దిగ్విజయ్ పై కెటిఆర్ ఫైర్, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు, తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కు మధ్య మాటల యుద్దం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న దిగ్విజయ్ తన వ్యాఖ్యలను వెంటను ఉపసంహారించుకోవాలని కెటిఆర్ సోమవారం నాడు ట్వీట్ చేశారు.

కెటిఆర్, దిగ్బిజయ్ సింగ్య మధ్య ట్వీట్ల యుద్దం జరిగింది. తెలంగాణ పోలీసులు ఓ బోగస్ ఐసీస్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సైట్ ద్వారా ముస్లిం యువకులను ఐసీస్ లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

అయితే ట్విట్టర్ లో కేటీఆర్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నుండి ఇలాంటి అత్యంత భాద్యతరహితమైన గర్హనీయమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా ఉపసంహారించుకోవాలని కెటిఆర్ ట్వీట్ చేశారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించాలని ఆయన దిగ్విజయ్ కు సవాల్ విసిరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister KTR angry on former Cm Digvijaysingh on Monday. he was irresponsible allegations on Telangana government said KTR on Twitter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి