వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్, కారణం ఇదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపారు. ప్రధానిని కలుసుకున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు సంబంధించి అదనపు సమాచారం కావాలని కోరడంతో కలిసినట్లు తెలిపారు.

ప్రధానితో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలు సహా పలు అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకుళ్లామన్నారు. విభజన హామీలు అమలు చేయాలని కోరామన్నారు. ఐటీఐఆర్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళ్తామని చెప్పామన్నారు.

Telangana minister KTR meets PM Narendra Modi

ఐటీఐఆర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరినట్లు చెప్పారు. హామీల విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరామన్నారు. కేంద్రం హామీలు, 10 ప్రతిపాదనలను ప్రధానమంత్రి ముందు ఉంచామన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న హామీని కూడా గుర్తు చేసినట్లు తెలిపారు.

Telangana minister KTR meets PM Narendra Modi

మీలాంటి వారు ఉండగా.. మీ సమాధానాన్ని అంగీకరించను: కేటీఆర్‌కు హీరోయిన్ ఈషామీలాంటి వారు ఉండగా.. మీ సమాధానాన్ని అంగీకరించను: కేటీఆర్‌కు హీరోయిన్ ఈషా

బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ప్రధానికి నివేదిక అందజేశామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా వేగం చేయాలని, మౌళిక వసతుల కల్పించేందుకు సహకరించాలని కూడా కోరారు.

English summary
Telangana minister KT Rama Rao on Wednesday met Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X