రైతు బంధు తెచ్చిన మాకు.. నల్లచట్టాలు తెచ్చిన మీకు పోలికా..? బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

వ్యవసాయానికి కేసీఆర్ దిక్చూచి

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో వ్యవసాయానికి కేసీఆర్ దిక్చూచిగా మారారని కొనియాడారు. దేశంలో నల్ల చట్టలు తెచ్చి రైతులను నట్టేట ముంచాలని చూసింది బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, తిట్ల పురాణలతో కాదు.. దమ్ముంటే రైతాంగానికి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లచట్టాలు తెచ్చిన బీజేపీ పాలనకు తెలంగాణలో కేసీఆర్ పాలనకు పోలికే లేదన్నారు.

టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీకొట్టిన చరిత్ర.. మోదీ ప్రభుత్వానిది కాదా ? అని విమర్శలు గుప్పించారు. వ్యవసాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్ అని కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా రైతు బంధును తీసుకుంటున్నాయని చురకలు అంటించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2 లక్షల 71 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.

దమ్ముంటే చర్చకు సిద్ధమా..? కేటీఆర్ సవాల్

బీజేపీ , కాంగ్రెస్ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై దమ్ముంటే చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. లెక్కలు ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఎన్డీఏ అంటేనే నో డేటా ఆవేలబుల్ ప్రభుత్వమని మోదీ సర్కార్ పై సెటైర్లు వేశారు.

Recommended Video

    BJP Is Not Biryani That KCR Can Easily Eat | Big Wigs Warns CM | Oneindia Telugu

    ఎన్డీఏ అంటేనే నో డేటా ఆవేలబుల్ ప్రభుత్వం


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు కేటీఆర్. కరెంట్ కష్టాలు, ఎరువులు, విత్తనాలు కొనబోతే లాఠీఛార్జీలు జరిపేవారని గుర్తుచేశారు. గతంలో రైతుల పట్నాలకు వలసలు పోతే.. ఇప్పుడు స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలే కన్పిస్తున్నాయన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. కాళేశ్వరం , పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ కు రెండు కళ్లు లాంటివని పేర్కొన్నారు. వీటిపై కొంత మంది దుర్మార్గులు కేసులు వేసినా వాటిని పూర్తి చేసి తీరతామన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+