హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాసినో మాధవ రెడ్డి ఇంట్లోని కారుకున్న స్టిక్కర్ నాదే: అయితే ఏంటంటూ మంత్రి మల్లారెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన క్యాసినో వ్యవహారంలో నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారుకు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు.

కారుకున్న స్టిక్కర్‌పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

కారుకున్న స్టిక్కర్‌పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

వివరాల్లోకి వెళితే.. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్​ ఉన్నట్టు.. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా అధికారులు గుర్తించారు.

ఆ కారుకున్న స్టిక్కర్ నాదే, కానీ..: మంత్రి మల్లారెడ్డి వివరణ

ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యే స్టిక్కర్​ విషయంపై వివరణ ఇచ్చారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదే అని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఆ స్టిక్కర్​ మాత్రం మార్చి 2022 నాటిదని తెలిపారు. ఆ స్టిక్కర్ మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని.. అది ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

ఈడీ నోటీసులు: సహకరిస్తానంటూ క్యాసినో ప్రవీణ్

ఈడీ నోటీసులు: సహకరిస్తానంటూ క్యాసినో ప్రవీణ్

ఇది ఇలావుండగా, క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.

నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ క్యాసినోలకు పలువురి తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. భారీ ఎత్తున హవాలా కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చీకోటి ప్రవీణ్ తెలిపారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.

English summary
Telangana minister malla reddy responded on car sticker in casino issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X