ఆ రోజున తెలంగాణలో సెలవు?

Holiday on International Adivasi Day: ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం 1994లో తొలిసారిగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఇండిజీనియస్ పీపుల్స్ అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది.

1994 డిసెంబర్ 23వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజును International Day of the World's Indigenous Peoplesగా గుర్తించింది.

Telangana Minister Seethakka requested CM Revanth Reddy to declare holiday on August 9

ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 370 నుంచి 500 మిలియన్లకు పైగా ఆదివాసీ ప్రజలు నివసిస్తోన్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో అయిదు శాతం మేర ఉన్నారు. భారత్‌లో ఆదివాసీల జనాభా సుమారుగా 10 శాతానికి పైమాటే. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 104 మిలియన్ల మంది వరకు ఆదివాసీలు నివసిస్తోన్నారు.

వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ప్రోత్సహించడానికి వివిధ రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటోన్నాయి. తెలంగాణలో కూడా ఆదివాసీల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. గోండు, కోయ, కోల్లం, బంజారా, లంబాడీ.. వంటి 21 తెగల ఆదివాసీలు తెలంగాణలో నివసిస్తోన్నారు.

ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది ప్రభుత్వం. వాటిల్లో భాగస్వామ్యం కావడానికి ఆ రోజున ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క.

దీనికి సంబంధించిన ఓ వినతిపత్రాన్ని ఆమె రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ వినతిపత్రంపై ఆదివాసీ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు - ఖానాపూర్, జారే ఆదినారాయణ- అశ్వారావుపేట, కోరం కనకయ్య- ఎల్లందు, పాయం వెంకటేశ్వర్లు- పినపాక, భద్రాచలం- డాక్టర్ తెల్లం వెంకట్రావ్, కోవా లక్ష్మి- ఆసిఫాబాద్.. సంతకాలు చేశారు. వారి వినతిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+