హత్య కేసులో తెలంగాణ మంత్రి కుమారుడు!?
లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్యలో ప్రేమ్ చంద్ హస్తముందన్న ఆరోపణల నేపథ్యంలో.. మంత్రి జోగు రామన్న కుమారుడిపై కేసు నమోదైంది.
ఆదిలాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడు ప్రేమ్ చంద్‌పై హత్య కేసు నమోదైంది. జైనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్యలో ప్రేమ్ చంద్ హస్తముందన్న ఆరోపణల మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో ప్రేమ్ చంద్‌తొ పాటు మరో తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై సెక్షన్-302 కింద పోలీసులు నమోదు చేశారు. కాగా, గ్రామంలోని ఆధిపత్య కక్షలే ఈ హత్యకు దారితీసి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications