పుష్కరాలు: కారు తోసిన హరీశ్ రావు, ట్రాఫిక్ పోలీసుల్లా విధులు(పిక్చర్స్)
హైదరాబాద్/కరీంనగర్: గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. దీంతో ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రహదారులపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిచేందుకు ట్రాఫిక్ పోలీసుల్లా విధులు నిర్వర్తించారు.
శనివారం ధర్మపురికి వెళ్లేందుకు కరీంనగర్ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయలుదేరారు. ధర్మారం మండలం ఖమ్మర్‌ఖాన్‌పేట వరకు వెళ్లే సరికి కాన్వాయ్ ముందుకు వెళ్లలేనంతగా వాహనాలు నిలిచిపోయాయి.
పరిస్థితిని గమనించిన మంత్రులు రెండు బుల్లెట్ వాహనాలను తెప్పించారు. వాటిపై ప్రయాణం చేస్తూ ఖమ్మర్‌ఖాన్‌పేట వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మొదలుపెట్టి ముందుకు సాగారు. వెల్గటూర్‌మండలం రాజారాం పల్లి వద్ద భారీగా వాహనాలు స్తంభించిపోవడంతో ఆరగంటపాటు రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు.
వెల్గటూర్ పోలీసులను పిలిచి మంత్రి హరీశ్‌రావు మందలించారు. వాకీటాకీలో మాట్లాడుతూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ వర్షంలోనూ ముందుకెళ్లారు. కోటిలింగాల రహదారి వద్ద గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర బుల్లెట్‌పై ప్రయాణించారు.
భద్రాచలంలో ముందు నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నప్పటికీ శనివారం భారీగా వాహనాలు పోటెత్తాయి. దీంతో అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి రహదారిపై గంటలపాటు నిల్చొని పర్యవేక్షించారు. వాహనదారులను ముందుకు కదిలిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మంత్రి హరీశ్ రావు
గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది.

మంత్రి హరీశ్ రావు
దీంతో ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రహదారులపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిచేందుకు ట్రాఫిక్ పోలీసుల్లా విధులు నిర్వర్తించారు.

హరీశ్ రావు, ఎమ్మెల్యే గంగుల
శనివారం ధర్మపురికి వెళ్లేందుకు కరీంనగర్ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయలుదేరారు.

మంత్రి హరీశ్
ధర్మారం మండలం ఖమ్మర్‌ఖాన్‌పేట వరకు వెళ్లే సరికి కాన్వాయ్ ముందుకు వెళ్లలేనంతగా వాహనాలు నిలిచిపోయాయి.

మంత్రి హరీశ్
పరిస్థితిని గమనించిన మంత్రులు రెండు బుల్లెట్ వాహనాలను తెప్పించారు. వాటిపై ప్రయాణం చేస్తూ ఖమ్మర్‌ఖాన్‌పేట వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మొదలుపెట్టి ముందుకు సాగారు.

కారుతోస్తున్న మంత్రి హరీశ్
వెల్గటూర్‌మండలం రాజారాం పల్లి వద్ద భారీగా వాహనాలు స్తంభించిపోవడంతో ఆరగంటపాటు రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు.

మంత్రి హరీశ్
వెల్గటూర్ పోలీసులను పిలిచి మంత్రి హరీశ్‌రావు మందలించారు. వాకీటాకీలో మాట్లాడుతూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ వర్షంలోనూ ముందుకెళ్లారు.

మంత్రి హరీశ్
కోటిలింగాల రహదారి వద్ద గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మంత్రి హరీశ్
ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర బుల్లెట్‌పై ప్రయాణించారు.

మంత్రులు హరీశ్, ఈటెల
ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర బుల్లెట్‌పై ప్రయాణించారు.

ట్రాఫిక్ జాం
నిజామాబాద్ జిల్లాలో 44వ నంబర్ జాతీయపై ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సుమారు పది కిలో మీటర్ల దూరం వరకు వాహనాలు బారులు తీరాయి.

ట్రాఫిక్ జాం
డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు వచ్చి ఆరు లైన్లలో కొనసాగుతున్న టోల్ ప్రక్రియను తొమ్మిది లైన్లకు పెంచారు.ట్రాఫిక్‌ను చంద్రాయన్‌పల్లి మీదుగా త్రియంబక్‌పేట, ఇందల్వాయి నుంచి జాతీయ రహదారిపైకి మళ్లించారు.

ఎద్దులబండిపై మంత్రి లక్ష్మారెడ్డి
కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల కోసం ఎద్దులబండిపై వస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి దంపతులు.

పుష్కర స్నానం
కాళేశ్వరంలో పుష్కర స్నానం చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దంపతులు.

కాళేశ్వరంలో పూజలు
కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న లక్ష్మారెడ్డి దంపతులు.

చిత్రపటం
మంత్రి లక్ష్మారెడ్డి దంపతులకు కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి చిత్రపటం అందజేస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు.

కందకుర్తిలో మంత్రి పోచారం
కందకుర్తి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.

భక్తులతో..
కందకుర్తి పుష్కర క్షేత్రంలో భక్తులతో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.

పూజలు చేస్తున్న స్వామిజీలు
కందకుర్తి పుష్కర క్షేత్రంలో గోదావరిలో పూజలు చేస్తున్న ఆధ్యాత్మిక గురువులు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications