హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో శనివారం సాయంత్రం టీవీ ప్రసారాలు బంద్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఎంఎస్‌ఓ మల్లెల నాగేశ్వర్‌రావు హత్యకు నిరసనగా శనివారం సాయంత్రం తెలంగాణలో టీవీ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఎంఎస్‌ఓల ఐకాస ప్రకటించింది.

శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 19న సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలన్ని నిలిపివేయనున్నట్లు ఎంఎస్‌ఓల ఐకాస కన్వీనర్ సుభాష్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఓలు, కేబుల్‌ ఆపరేటర్లు ఇటీవల సమావేశమై ఐకాసగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎంఎస్‌ఓ మల్లెల నాగేశ్వర్‌రావు హత్యకు నిరసనగా కొద్ది గంటల పాటు ప్రసారాలను బంద్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Telangana mso announced TV broadcasting bandh tomorrow

ఈ సమావేశంలో ఐకాస కన్వీనర్‌ పమ్మి సురేష్‌, ఐకాస వివిధ జిల్లాల నాయకులు ఏచూరి భాస్కర్‌, చంద్రశేఖర్‌, మహేంద్ర, మౌలానా, రాజు, కృష్ణ, జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో అవివాహిత మృతి

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌తో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంకు చెందిన ద్వారకారాణి (22) అనే అవివాహిత ఇల్లు శుభ్రం చేస్తుంది.

ఈ క్రమంలో ఆమె పోసిన నీళ్లు జీఐ వైరుకు తగలడంతో షాక్‌కు గురైంది. దీంతో ద్వారకారాణి అక్కడిక్కడే మృతి చెందింది. యువతి మృతితో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

English summary
Telangana mso announced TV broadcasting bandh tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X