రాజ్యాంగ బద్దంగా పని చేస్తానన్న కొత్త గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ ...
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. కొన్ని నెలల క్రితం సీనియర్ రాజకీయ నాయకుడు, బిజెపిలో కీలకంగా పనిచేసిన నేత బిశ్వ భూషణ్ హరి చందన్ ను ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమించారు. ఇక తాజాగా తెలంగాణ బిజెపి నాయకుడు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానూ, తెలంగాణ లో పనిచేస్తున్న ఈయన నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బిజెపి నాయకురాలు తమిళ సై సౌందరరాజన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సై సౌందరరాజన్ ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10న గవర్నర్ నరసింహన్ గవర్నర్ గా ఇంతకాలం తన నిర్వర్తించిన బాధ్యతల నుండి విరమణ పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం తో ముడిపడిన అనుబంధంపై ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు.

ఇక దీంతో ఈనెల 11న తమిళ సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళనాడులో జన్మించిన తమిళ సై సౌందరరాజన్ తెలుగు ప్రజల పట్ల కూడా అంతే సహజం భావంతో మెలుగుతానని ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తెలుగు సోదర , సోదరీమణులతో అనుబంధాన్ని పంచుకోగలగడం తన అదృష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఎప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను గానీ తాను కలవలేదని వెల్లడించారు. ఒకసారి ఫోన్ లో మాత్రం సంభాషించానని ఆమె పేర్కొన్నారు. ఇక తాను రాజకీయాల కోసం కాదు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం కోసం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వస్తున్నానని ఆమె వెల్లడించారు.












Click it and Unblock the Notifications