అంత ఆషామాషీ కాదు.. కొత్త సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టడం
తెలంగాణ అస్తిత్వ వైభవానికి అధ్బుతమైన ప్రతీకగా నిలవబోతున్న కొత్త సచివాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదగా ప్రారంభమైన ఈ సెక్రటేరియట్ లోకి ప్రవేశించడం సందర్శకులకు అంత సులభం కాదు. అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ కార్డు పాసులు ఇలా.. లోపలికి వెళ్లే ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే పంపిస్తారు.
సచివాలయంలోకి సందర్శకుల ప్రవేశానికి స్మార్ట్ కార్డ్‌తో కూడిన పాస్‌లు జారీ చేయనున్నారు. స్మార్ట్ కార్డుల పాసులతో పాటు ఫేస్ రికగైజేషన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చారు. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవడంతోపాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వారి మొత్తం సమాచారం అప్పటికప్పుడు ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. సందర్శకుని పూర్తి వివరాలు కంప్యూటర్ తెరపైకి వస్తాయి. నేరచరిత్ర ఉంటే వెంటనే నిలిపివేస్తారు. ఆ భద్రతా వలయాన్ని దాటిన తర్వాతే ఎవరైనా కొత్త సచివాలయంలోకి ప్రవేశించగలరు.

భవనంలో మొత్తం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 650 మంది సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు రక్షణ కల్పిస్తారు. 5వ అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూంకు ఈ కెమెరాలన్నీ అనుసంధానమై ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది. 28 ఎకరాల్లో నిర్మితమైన సచివాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. నార్త్‌వెస్ట్ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు. ఈశాన్యం నుంచి సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు రాకపోకలు సాగిస్తారు. ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరుల కోం తూర్పు గేట్ ఉపయోగిస్తారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications