అద్భుతాలకు, ప్రత్యేకతలకు నిలయం... తెలంగాణ సచివాలయం

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించినా, యాదాద్రి పునర్నిర్మాణంతో దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా.. నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా అవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి తార్కాణమని భారత రాష్ట్ర సమితి నేతలు కొనియాడుతున్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే ప్రజాస్వామ్య దీపిక నూతన సచివాలయమని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నూతన సచివాలయం ఎన్నో విశిష్టతలతో ప్రాణం పోసుకుంది. 28 ఎకరాల్లో రూ.610 కోట్ల వ్యయంతో నిర్మాణమైన ఆ భవనం ఆ విశిష్టతలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఇండో పర్షియన్ అరేబియన్ శైలిలో, దక్కన్, కాకతీయ శాలివాహన సంస్కృతి ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు.

 sachivalayam1
* కేవలం 26 నెలల్లో నిర్మాణం పూర్తి
*10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. 8 అంతస్తుల్లో సౌథం
* 30 కాన్ఫరెన్స్ హాల్స్.. ఒక్కోటి 10 సినిమా హాళ్లకు సమానం..
* 28 ఎకరాల్లో భవన నిర్మాణం
* 1000 లారీల రెడ్ స్టోన్ ఉపయోగించారు
* ఏసీ ప్లాంట్ కు పట్టిన సమయం 6 నెలలు
* గల్వనైడ్ రీ ఎన్ఫోర్స్ మెంట్ కాంక్రీటు (జీఆర్సీ) తొడుగుకు పట్టిన సమయం 6 నెలలు
* తాజ్ మహల్, కుతుబ్ మీనార్ కంటే ఎక్కువ ఎత్తు
* ఈ భవనం నిర్వహణకే రూ.12 కోట్ల ఖర్చుఅవుతుంది
* 635 గదులు, 30 కాన్ఫరెన్స్ హాల్స్
* ఒక్కో అంతస్తు ఎత్తు 14 అడుగులు
* అశోక చిహ్నం ఎత్తు 14 అడుగులు
* మొత్తం లిఫ్టులు 24
* దేశంలో గోల్డ్ బిల్డింగ్ సర్టిఫికెట్ కలిగిన ఏకైక నిర్మాణం
* సెక్యూరిటీ సిబ్బంది 300
* సీసీ కెమెరాలు 300
* విజిటర్స్ కోసం యాక్సెస్ కార్డులు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+