హైదరాబాద్‌లో ఆగని కరోనా కల్లోలం: తెలంగాణలో భారీగా కొత్త కేసులు..మరణాలు: 55 వేలకు పైగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వెల్లువ కొనసాగుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కల్లోలం తీవ్రంగా ఉంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సహా దీనికి ఆనుకుని ఉండే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోనూ అధిక కేసులు రికార్డు అయ్యాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 1473 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 774 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,532కు చేరుకుంది. ఇందులో 42,106 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 471గా నమోదైంది. యాక్టివ్ కేసులు 12,955కు చేరుకున్నాయి. జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణలో నమోదవుతోన్న మరణాల శాతం 0.85 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.3గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Telangana: Newly 1473 COVID 19 positive cases and 8 deaths reported in past 24 hours

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. 24 గంటల్లో జీహెచ్ఎంసీలో 506 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, వరంగల్ అర్బన్-111, సంగారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్ జిల్లాలో 91 మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 86 కేసులు వెలుగులోకి వచ్చాయి. పలు జిల్లాల్లో కేసులు పరిమితంగానే నమోదు అయినప్పటికీ..పూర్తిగా అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.

24 గంటల్లో ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-10, జగిత్యాల-18, జనగామ-10, జయశంకర్ భూపాపల్లి-10, జోగుళాంబ గద్వాల-32, కామారెడ్డి-17, ఖమ్మం-20, మహబూబ్ నగర్-8, మహబూబాబాద్-34, మంచిర్యాల-14, మెదక్-17, ములుగు-12, నాగర్ కర్నూలు-19, నల్లగొండ-28, నారాయణపేట్-2, నిజామాబాద్-41, రాజన్న సిరిసిల్ల-19, సిద్ధిపేట్-12, సూర్యాపేట్-32, వికారాబాద్-2, వనపర్తి-9, వరంగల్ రూరల్-8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+