నల్గొండ కాల్పులపై నాయిని: అదేం ప్రకటన.. ఆగ్రహం

హైదరాబాద్: నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్ అంశంపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర హోంమంత్రి నాయిని ప్రకటనను మండలిలో కాంగ్రెస్ పక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం ఆక్షేపించారు.

దుండగులు దొంగల ముఠాకు చెందిన వారేనని, ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు కాదని హోంమంత్రి మాట్లాడటం సరికాదన్నారు. హోంమంత్రి ప్రకటనను డీజీపీ సైతం సమర్థించినట్లుగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నాయిని వ్యాఖ్యల పైన భారతీయ జనతా పార్టీ, టీడీపీలు కూడా విమర్శలు గుప్పించాయి.

Telangana opposition leaders fires at Nayini

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. నాయిని వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారు దొంగల ముఠాకు చెందిన వారేనని చెప్పడం విడ్డూరమన్నారు. నాయిని నర్సింహా రెడ్డిది నిర్లక్ష్యం ప్రకటన అన్నారు.

టీడీపీ నేతలు ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరిగారు. పోలీసులు బాగా పని చేశారని టీడీపీ నేతలు కితాబిచ్చారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రత్యేక బృందాన్ని పంపిస్తే మరింత బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే ఇంత నష్టం జరగకపోయి ఉండేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+