ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు తాజాగా ముగిసింది. రెండోరోజు సర్పంచ్ స్థానాలకు 4,901 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే రెండో రోజు వార్డు మెంబర్ల స్థానాలకు 9,643 నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఇక రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు, 11,502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ తుది గడువుగా ఉంది.
తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసింది. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు గాను 8198 నామినేషన్లు వచ్చాయి. 11,502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి విడతలో భాగంగా 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయితీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లను స్వీకరించారు. నవంబర్ 30న నామినేషన్ల పరిశీలన, అలాగే చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.
ఇక డిసెంబర్ 1 సోమవారం అప్పీళ్ల స్వీకరణ ఉంటుంది. అలాగే డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. అలాగే డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఇక అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారు.

డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక నవంబర్ 30 నుంచి డిసెంబరు 2 వరకు రెండో విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో భాగంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications