వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్, ఏకాకి!: కేసీఆర్‌కు 'ఏపీ' మద్దతు, జగన్ పార్టీ ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలోనే ఇతర పార్టీల నుండి మద్దతు లభించడం లేదని చెప్పవచ్చు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో సెక్షన్ 8 తెరపైకి వచ్చింది.

ఏడాది క్రితమే చంద్రబాబు సెక్షన్ 8 గురించి కేంద్రాన్ని కోరారు. కానీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 8 విషయంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఏకాకిగా మిగిలింది. సెక్షన్ 8 పెడితే తప్పేమిటని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కానీ, హైదరాబాదులో సెక్షన్ 8 అవసరం లేదని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాదననే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఇతర పార్టీలు బలపరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సెక్షన్ 8 పైన ఏపీ రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు పలుకుతున్నాయనే చెప్పవచ్చు.

Telangana parties, minus Telugudesam, fight Section 8

ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. సెక్షన్ 8 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని చంద్రబాబును నిలదీస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఓ అడుగు ముందుకు వేసి సెక్షన్ 8 అవసరం లేదని చెబుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో సెక్షన్ 8 ఉందని ట్విస్ట్ ఇచ్చారు.

కేవలం ఏపీ టీడీపీ నేతలు, మంత్రులు సెక్షన్ 8 కోసం డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు వారు దీనిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.

హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాల్సిందేనని చెబుతున్న ఏపీ మంత్రులు అందుకు పలు నిదర్శనాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా, జేఎన్టీయూలో ప్రొఫెసర్ పైన దాడి జరగడాన్ని కూడా ఉదహరిస్తున్నారు. సెక్షన్ 8 విషయంలో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, వైయస్సార్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచాయి.

English summary
In a repeat of the pre-bifurcation days, the TRS and Opposition parties barring the TD have united to prevent the implementation of Section 8 of the AP Re-Organisation Act, which allows for the Governor’s control over law and order in the common capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X