శ్రీనగర్ లాల్‌చౌక్‌లో రేవంత్ రెడ్డి- భరతమాత ముద్దుబిడ్డగా అది నా బాధ్యత

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది.

హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. శ్రీనగర్‌లో ఏర్పాటు కానున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ సభతో ఆయన చేపట్టిన 3,500 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్ పాదయాత్ర ముగుస్తుంది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సీనియర్లు హాజరు కానున్నారు.

గత ఏడాది 7న

గత ఏడాది 7న

గత ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్‌కు చేరింది. మధ్యలో కొంత విరామం తీసుకుంటూ ఆయన ఈ యాత్రను పూర్తి చేశారు.

 హర్యానాలో..

హర్యానాలో..

ఈ తెల్లవారు జామున 6 గంటలకు జమ్మూ కాశ్మీర్ లో యాత్రను మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. ప్రియాంకా గాంధీ వాద్రా సహా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు చారిత్రాత్మక లాల్ చౌక్ వద్దకు చేరుకుని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాహుల్ గాంధీకి శ్రీనగర్ లో అపూర్వ ఆదరణ లభించింది. యాత్ర సాగే మార్గంలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, విస్తృతంగా కనిపించాయి.

 రేవంత్, సీతక్క..

రేవంత్, సీతక్క..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇవ్వాళ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ ఉదయం ఆయన శ్రీనగర్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో పాటు నడిచారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మధిర శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇవ్వాళ్టి యాత్రలో వారంతా స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలిచారు.

లాల్ చౌక్ వద్ద..

లాల్ చౌక్ వద్ద..

మధ్యాహ్నం 12 గంటలకు లాల్ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో వారంతా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారత్ జోడో సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సభను ఓ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారాయన. నవ భారత నాయకుడు రాహుల్ గాంధీని శ్రీనగర్ లో కలుసుకున్నానని, అనేక విషయాలపై ఆయనతో చర్చించానని పేర్కొన్నారు. నిస్వార్థ ప్రజాసేవకు ఒక రాహుల్ ఓ నిలువెత్తు స్ఫూర్తి అని చెప్పారు.

 భరతమాత ముద్దుబిడ్డగా..

భరతమాత ముద్దుబిడ్డగా..

లాల్ చౌక్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కాశ్మీర్ గడ్డపై జాతీయ జెండా రెపరెపలాడుతుంటే సగటు భారతీయుడిగా తన హృదయం ఉప్పొంగుతోందని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డగా తన జీవితంలో ఇది గర్వించ దగ్గ క్షణమని చెప్పారు.

అసేతు హిమాచలం ఏకం..

ఈ దేశం కోసం ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ.. ఆసేతుహిమాచలాన్ని ఏకం చేశాడని, భారతీయతను తట్టిలేపాడని అన్నారు. నిస్వార్థంగా, నిజాయితీగా, నిజమైన సేవకుడుగా 140 కోట్ల ప్రజల ముందు తెరిచిన పుస్తకమయ్యాడని చెప్పారు. రేపటి భారతానికి నిఖార్సయిన నాయకత్వం భారత్ జోడో యాత్ర అందించిందంటూ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+