Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొంగులేటి బీజేపీలో చేరుతాడనుకున్నా- వారిద్దరూ మాకు రెండుకళ్లు: రేవంత్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. జులై 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఇది.

ponguletirevanthreddy

ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఈ సభను నిర్వహించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. లక్షలాదిమందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార భేరిని మోగించనుంది కాంగ్రెస్.

తెలంగాణ జనగర్జన ఏర్పాట్లను తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భారత్ రాష్ట్ర సమితి నాయకుల గుండెలు అదిరేలా జన గర్జన సభను నిర్వహించబోతోన్నామని అన్నారు. ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సభను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బస్సులు అడిగితే ప్రభుత్వం ఇవ్వట్లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,500 బస్సుల ద్వారా జనాలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామిన పేర్కొన్నారు. రెండు కోట్ల రూపాయల అద్దె కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ- ప్రభుత్వం అంగీకరించట్లేదని విమర్శించారు.

revanthreddy

ఎవరు అడ్డుకున్నా, ఎంతమంది అడ్డు వచ్చినా తొక్కుకుంటూ జన గర్జన సభకు తరలి రావాలని రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ బలం ఏమిటో ఈ సభ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేయాలని సూచించారు. జనగర్జన సభ నుంచి బీఆర్ఎస్‌ పతనం ఆరంభమౌతుందని, ఎన్నికల నాటికి ఆ పార్టీకి సమాధి కడతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

1,300 కిలో మీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని, ఇది కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి తమకు రెండు కళ్లలాంటి వారని కితాబిచ్చారాయన. ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

తొలుత పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. భారతీయ జనతా పార్టీలో చేరుతారని తాను భావించానని, ఆయనకు వ్యాపారాలు ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకున్నానని రేవంత్ చెప్పారు. ప్రజల నిర్ణయం మేరకు కాంగ్రెస్‌లో చేరనున్నారని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌ గ్రామస్థాయిలో ఏ స్థాయిలో బలోపేతమైందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందనే ఆశాభావాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. మరో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తేల్చి చెప్పారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు అడ్రస్ లేకుండా పోతుందని, బీఆర్ఎస్‌ను ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+