హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ముందస్తు' లేకుండానే ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, మరో భేటీలో 'కీలక' నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ముందు కాబినెట్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి నివేదన సభకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని జోరుగా చర్చ సాగింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై ఊహించని నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ అలాంటి అంశాలు లేకుండానే కేబినెట్ భేటీ ముగిసింది. దీంతో సభలో ఏం చెప్తారనే ఉత్కంఠ ఉంది.

కేబినెట్ భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Telangana Politics: Cabinet Meet Ends Without Word on Early Polls

ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం చెప్పారు. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ జరగనుందన్నారు. ఆ కేబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

బీసీలకు హైదరాబాద్‌లో 70 కోట్లతో 71 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ఈటెల చెప్పారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో ఐదు ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంపు, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న తొమ్మిది వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ.40 వేలకు పెంపు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

English summary
Deputy chief minister Kadiyam Srihar said that another Cabinet meeting will be held "soon" and "key decision" will be taken. With this, the suspense about whether the dissolution of Assembly will take place or not continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X