గుర్రాలతో తొక్కించారు, దెబ్బకు ఢిల్లీకి పరుగు.. సంతోషపడాలి కానీ: కేసీఆర్
హైదరాబాద్: నాడు టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు తగ్గించాల్సింది పోయి, అంగన్వాడీ జీతాలు తగ్గించాల్సింది పోయి గుర్రాలతో తొక్కించారని, లాఠీలతో కొట్టించారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మనం అసెంబ్లీని రద్దు చేస్తే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ పెత్తనాన్ని ఢిల్లీ చేతుల్లో పెడతామని అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఆవురావురమంటూ ఆకలితో ఉన్నారని, వారు మొత్తం మింగేస్తారని మండిపడ్డారు.

మన రాజకీయం మన చేతుల్లో
మన రాజకీయం మన చేతుల్లో ఉండాలని మేం అంటున్నామని, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల చేతుల్లో పెడతానని చెబుతోందని కేసీఆర్ అన్నారు. మీ ఆశీర్వాదంతో నేను యుద్ధానికి బయలుదేరుతున్నానని చెప్పారు. హుస్నాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. సమైక్యపాలనలో శిథిలమైన తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

గుర్రాలతో తొక్కించారు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు మీతో ఎలాంటి వెట్టి చాకిరి చేయించారో తెలుసునని కేసీఆర్ అన్నారు. అంగన్వాడీలు జీతాలు అడిగితే ఒకడు గుర్రాలతో తొక్కించారని, మరొకరు వెట్టి చాకిరి చేయించారన్నారు. తాము అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని చెప్పారు. మీతో ఎవరు వెట్టి చాకిరి చేయించారో, ఎవరు బానిసలుగా చూశారో.. వారు మీ ముందుకు వస్తారని, వారిని నమ్మవద్దన్నారు. అంగన్వాడీ సహా అందరికీ జీతాలు పెంచుతామని చెప్పారు. సమైక్య పాలనలో జీవన విధ్వంసం జరిగిందని, కులవృత్తులు పోయాయని, చేనేత సోదరులు నష్టపోయారని చెప్పారు.

మనం గెలవటం ఖాయమని తెలుస్తోంది
గతంలో రూ.వెయ్యి ఇవ్వాలనే ఆలోచన రాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పింఛన్ రూ.2వేలు ఇస్తానని చెబుతోందని, కానీ అది పేదలపై ప్రేమతో కాదని కేసీఆర్ చెప్పారు. గులాబీ జెండాపై భయంతో వారు ఇస్తామని అబద్దపు హామీలు ఇస్తున్నారని చెప్పారు. తెరాస పాలనలో హత్యా రాజకీయాలు లేవని, గూండా రాజకీయాలు లేవన్నారు. హుస్నాబాద్ పచ్చబడాలన్నారు. హుస్నాబాద్‌కు వచ్చిన జనాలను చూస్తుంటే మనం గెలవటం ఖాయమని తెలుస్తోందన్నారు. చివరగా కారు గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేశారు.
అసెంబ్లీ రద్దైతే సంతోషపడతారు కానీ
సాధారణంగా ఎక్కడైనా అసెంబ్లీ ముందే రద్దయితే సంతోషపడతారని, కానీ ఇక్కడ నేను రద్దు చేస్తే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆగం ఆగం అవుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి దిక్కుతోచడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీలో బాసులు ఉంటారని, టిక్కెట్లు కూడా ఢిల్లీలో తెచ్చుకుంటారని చెప్పారు. తాము అసెంబ్లీ రద్దు చేస్తామని ప్రచారం జరిగినప్పుడు అన్ని పార్టీలు ముందస్తుకు సిద్ధమని చెప్పాయని, ఇప్పుడు మాత్రం బెంబేలు ఎత్తుతున్నాయని అన్నారు. తెలంగాణ కోసం పేగులు పోయేదాకా కొట్లాడామని, చావుదాకా వెళ్లి వచ్చానని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications