తెలంగాణాలో అత్యంత భారీ వర్షాలు..17 జిల్లాలకు రెడ్ అలెర్ట్!

నిన్నా మొన్నటి వరకు ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాల హెచ్చరిక ఇచ్చింది. వాయుగుండానికి తోడు కర్ణాటక, కోస్తా ఆంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోంది. తాజాగా తెలంగాణా వర్షాలపైన వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల, అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం, గురువారం రోజుల్లో 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది.

Telangana rains red alert IMD issues Red Alert for 17 Telangana districts amid heavy rains cm alert officials

బుధవారం రెడ్ ఎలర్ట్ ఉన్న జిల్లాలు - పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట. ఆదిలాబాద్. ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నిర్మల్‌కు ఆరెంజ్ అలర్ట్ ఉంది. గురువారం కూడా కొన్ని జిల్లాలకు రెడ్, మరికొన్నింటికి ఆరెంజ్ హెచ్చరికలు కొనసాగుతాయి. గురువారం కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి.

వారికి దసరా గిఫ్ట్.. కొత్త పెన్షన్స్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్!
వారికి దసరా గిఫ్ట్.. కొత్త పెన్షన్స్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్!

ఖైరతాబాద్‌లో 3.2 సెం.మీ., కూకట్‌పల్లిలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 25, 26 తేదీల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి, రోడ్లు, కాలనీల్లో నీరు నిలిచిపోకుండా చూడాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+