మరో ఐదు రోజులూ వర్షాలే.. హెచ్చరిక పంపిన వరుణుడు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌ చోట్ల వర్షాలు కురిశాయి. సిద్ధిపేట జిల్లాలో భారీ వర్షాలు కురువగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదయింది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
నేడు వర్షాలు ఈ జిల్లాలలో
ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

సోమవారం ఈ జిల్లాలలో వర్షాలు
ఇక సోమవారం నాడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళవారం వర్షాలు ఇలా
మంగళవారం నాడు కరీంనగర్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి , వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు అలెర్ట్
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురువగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. అలాగే వర్షాల వేళ చెట్ల క్రిందకు వెళ్ళకుండా ఉండాలని చెప్తున్నారు. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని చెప్తున్న క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలి.












Click it and Unblock the Notifications