హెచ్చరిక.. రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన వాతావరణశాఖ
దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీతోపాటు తెలంగాణపై కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. నాలుగో తేదీ నుంచి వరుసగా ఐదురోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో దాదాపు మూడు వారాలు రాష్ట్రమంతటా వాతావరణం మసకేసింది. సూర్యుడు కనపడటమే గగనమైంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణ అంతటా తేలికపాటి జల్లులతో వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది.
తెలంగాణపై నాలుగు రోజుల ప్రభావం
బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ కు సమీపంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ ప్రభావం తెలంగాణపై నాలుగు రోజులు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈరోజు రాత్రి పదిగంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పెరుగుతాయి. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత 31 డిగ్రీల దగ్గర నమోదవుతోంది. ఇదే ఉష్ణోగ్రత ఏపీలో 35 డిగ్రీలుగా నమోదవుతోంది.

నిండు కుండల్లా శ్రీశైలం, నాగార్జునసాగర్
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల్లో నీరు తొణికిసలాడుతోంది. శ్రీశైలం నుంచి నాలుగు గేట్లు తెరిని నీటికి దిగువకు విడుదల చేశారు. ఇతర ప్రాజెక్టుల్లో కూడా నీరు సమృద్ధిగా ఉంది. విపత్తులు తలెత్తితే సహాయక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతేనే ప్రజలకు బయటకు రావాలని సూచించింది.












Click it and Unblock the Notifications