తెలంగాణాలో రాజ్యసభ కుర్చీలాట: కేసీఆర్ చుట్టూ ఆశావహుల ప్రదిక్షణలు; రేసులో ఉన్నది వీళ్ళే!!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. రాజ్యసభ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజ్యసభ స్థానాలను దక్కించుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలలో రేస్ మొదలైంది. ఈ నెల 21తో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆపై ధర్మపురి శ్రీనివాస్ ఇరువురి రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. ఇక గతంలోనే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ కారణంగా మొత్తం మూడు స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.

రాజ్యసభలో రేసులో సీనియర్లు.. కేసీఆర్ చుట్టూ ప్రదిక్షణలు
గతంలో అనేక పర్యాయాలు పదవులకోసం ప్రయత్నాలు చేసి భంగపడిన ఆశావహులు మళ్లీ మరోమారు గులాబీ బాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజ్యసభ సీట్లు దక్కించుకోవడం కోసం ఎవరి రూట్లో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అసెంబ్లీలో పూర్తి మెజారిటీ తో పాటుగా అత్యధిక ఎమ్మెల్యేలు ఉండడంతో రాజ్యసభ స్థానాలు మూడింటిని టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక రాజ్యసభకు ఎవర్ని పంపాలి అన్నదానిపై ఇప్పటికే కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

సామాజిక సమీకరణాల ప్రకారం రాజ్యసభ దక్కేది ఈ సామాజిక వర్గాలకే
సామాజిక సమీకరణాల ప్రకారం ప్రస్తుతం రిటైర్ అవుతున్న వారిలో ఒకరు బీసీ సామాజికవర్గం, మరొకరు ఎస్సీ సామాజికవర్గం. ఇక ఇటీవల బిసి సామాజిక వర్గానికి చెందిన బడుగుల లింగయ్య యాదవ్ ను రాజ్యసభకు పంపించడంతో బీసీలకు మరో అవకాశం ఇచ్చే ఛాన్సే లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు భర్తీ చేసే మూడు స్థానాలకు సామాజిక కోణంలో ఒక ఎస్సీ, రెండు ఓసీలకు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తుంది.

రేసులో ఉన్న వారి జాబితా ఇదే
ఇప్పటికే బండ ప్రకాష్ స్థానానికి నామినేషన్ పర్వం ప్రారంభమైంది. మిగతా రెండు స్థానాలకు కూడా త్వరలో నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 31వ తేదీ నామినేషన్ల చివరి తేదీ గా ప్రకటించింది. దీంతో ఈసారి చాలామంది మాజీలు, సీనియర్లు రాజ్యసభ కుర్చీ సంపాదించడం కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.
టిఆర్ఎస్ లో రాజ్యసభ స్థానాలకు రేసులో ఉన్న వారి జాబితా చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, దామోదరరావు, మోత్కుపల్లి నర్సింహులు, గుడాల భాస్కర్, బాలమల్లు, మంద జగన్నాథం, వేణుగోపాలచారి, సీయల్ రాజం, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్ తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ప్రకాష్ రాజ్, వినోద్ కుమార్ ల పేర్లు
ప్రధానంగా మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను ఈసారి రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఢిల్లీలో వినోద్ సేవలు అవసరమని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కవితను కూడా రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని తాజాగా చర్చ జరిగింది. కవిత విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. ఇక ప్రకాష్ రాజ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది.

కేసీఆర్ దృష్టి ఎవరి మీద పడుతుందో?
కానీ కేసీఆర్ పెద్దల సభకు పంపించే వారు ఎవరన్నది కెసిఆర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరూ ఊహించని వారికి కూడా కెసిఆర్ అవకాశమిచ్చి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆశావహుల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉన్నా కెసిఆర్ దృష్టి ఎవరి మీద పడుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications