నీతిఆయోగ్ సూచిలో తెలంగాణ మూడో స్థానం.!యూపీ చివరి స్థానం.!చర్చకు సిద్దమా?అమత్ షా కు హరీష్ సవాల్.!
హైదరాబాద్ : బిజెపి,టీఆర్ఎస్ నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ రెండవ దశ పాద యాత్ర ముగింపు సందర్బంగా కేంద్ర హోం మంత్రి అమీత్ షా చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాలు షేక్ చేస్తోంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమీత్ షా పర్యటన పట్ల ప్రశ్నల వర్షం కురిపించినా అంతగా ప్రభావం చూపించలేదు. దీంతో మంత్రి హరీశ్ రావు రంగ ప్రవేశం చేసి అమిత్ షా పై వియర్శనాస్త్రాలు సంధించారు.

తుక్కుగుడా సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారు.. అమీత్ షా పై హరీష్ ఫైర్
అమిత్ షా కాదు అబద్ధాల షా..అబద్ధాలకు బాద్ షా.. మిత్ షా.. అలవోకగా అబద్ధాలు మాట్లాడారు.. అమిత్ షా వచ్చి జూటా మాటలు చెప్పి వెళ్లారు.. ఇది గుజరాత్ కాదు. అమాయకులైన తెలంగాణ కాదు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ గడ్డ..ఇక్కడ నీ అబద్ధాలు నడవవు.. తెలంగాణలో నీ అబద్ధాలు చెల్లవు..మీకు దమ్ము, దైర్యం ఉంటే తాము సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు కేంద్ర హోం మంత్రి అమీత్ షా పై ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా హరీష్ రావు ఆరు ప్రధానమైన ప్రశ్నలను అమీత్ షా కు సంధించారు.

బీజేపి అబద్దాలను తెలంగాణ ప్రజలు నమ్మరు.. అమీత్ షాకు హరీష్ ధీటైన కౌంటర్
హరీష్ రావు ప్రశ్నల్లో మొదటిది ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపింది. ఇది వాస్తవం. మా ఎంపీలు ఓటు కూడా వేశారన్నారు హరీష్. 2, మిషన్ భగీరథ కు కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది అన్నారు. నిజం చెప్పండి. వాస్తవాలు మాట్లాడండి. రెండు రూపాయలయినా ఇచ్చారా. ఆధారం చూపండి. సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు ఇంచిందని కేంద్రం కూడా చెప్పింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం చెప్పిందన్నారు హరీష్ రావు. 3, ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు అన్నారు. ఇది అబద్దం. 18, మే 2021 నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.

నీళ్ళు, నిధులు, నియామకాల గురించి మాట్లాడటం పెద్ద జోక్. ఎద్దేవా చేసిన హరీష్
4, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయలేదు అన్నారు. 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు 2679 కోట్లకు శంకుస్థాపన చేశారు. లోకల్ బిజెపి నాయకులు చెప్పరా..తెలియదా ఈ విషయం అని ప్రశ్నించారు. నీతి అయోగ్ సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. డబుల్ డెక్కర్ ఉన్న యూపీ చివరలో ఉందన్నారు.
ఇంతటి కఠోర వాస్తవాలు కళ్ల ముందు కదలాడుతుంటే అబద్దాలు చెప్తారా.?నిజాలపై చర్చకు సిద్దంగా ఉన్నారా.? అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. 5, మన ఊరు మన బడి పైసలు మాయే అన్నారు. 7300 ఖర్చు చేస్తున్నాం. సర్వ శిక్ష అభియాన్ లో వచ్చేది 300 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్లు సమకూరుస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నది. అది తెల్సా మీకు. మొత్తం మేమే ఇస్తున్నాం అంటున్నారని నిలదీసారు. 6, నరెగా కు 30 వేల కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి చెప్తుండగా, అమిత్ షా 18 వేల కోట్లు అంటారుని, ఒక్కొక్కరిది ఒక్కో మాట, జుటా మాటలు తప్ప ఏం లేదన్నారు హరీష్ రావు.

బీజీపీ పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్నారు. ఏమైందో చెప్పాలన్నారు హరీష్
అమిత్ షా సాదా సీదాగా మాట్లాడితే తెలంగాణలో ఓట్లు పడవనే ఉద్దేశంతో అబద్ధాల పురాణాలు చదివారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై అబద్ధాలు ప్రచారం చేసుకున్నారన్నారు.రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులను మంజూరూ చేయడంలో కూడా అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామకాల గురించి మాట్లాడే నైతికత అమీత్ షా కు లేదని, ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలని నిలదీసారు. చంద్రశేఖర్ రావు ముందు చూపు వల్ల ఇప్పుడు 2.59 లక్షల మెట్రిక్ టన్నులు పందుతున్నదని, తెలంగాణ ఏర్పాటు సమయంలో 99 లక్షల మెట్రిక్ టన్నులు పండేదని హరీష్ రావు గుర్తు చేసారు.