తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా 2,34,692 కొత్త కేసులు...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజులు 3వేల మార్క్ దాటిన కేసులు... శుక్రవారం (ఏప్రిల్ 16) రికార్డు స్థాయిలో 4వేల మార్క్‌ని దాటాయి. గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 12 మంది కరోనాతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం(ఏప్రిల్ 17) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
మరో 6336 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,809కి చేరింది. ప్రస్తుతం 33,514 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 22,118 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1414 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,11,008కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.52శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 87.2 శాతం ఉండగా తెలంగాణలో 89.8 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 598 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,16,08,226 కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,34,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1341 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,75,649కి చేరింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 14,95,397 కరోనా టెస్టులు నిర్వహించగా... మొత్తం టెస్టుల సంఖ్య 26,49,72,022కి చేరింది.












Click it and Unblock the Notifications