Warangal: టాంజానియాలో తేనెటీగల దాడిలో తెలంగాణ వాసి మృతి..
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి టాంజానియాలో మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టాంజానియాలో జరిగిన తేనెటీగల దాడిలో మరణించాడు. ధర్మారావుపేటకు చెందిన పడకంటి బ్రహ్మచారి 20 ఏళ్ల క్రితం హెటల్ మేనెజ్ మెంట్ చేశాడు. ఉపాధి నిమిత్తం అతను 19 ఏళ్ల క్రితం అఫ్రికా ఖండమైన కెన్యాకు వెళ్లాడు.
కరోనా లాక్ డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో కెన్యా పక్క దేశమైన టాంజానియాకు వెళ్లాడు. అక్కడ 100 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ముడేళ్లుగా అక్కడే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. బ్రహ్మచారి గత సంవత్సరం ఆగస్ట్ లో ఇండియాకు వచ్చాడు. ధర్మారావుపేటలో పెద్ద కూతురు వివాహం చేసి తిరిగి టాంజానియా వెళ్లాడు.

బ్రహ్మచారి సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ పొలంలో ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో బ్రహ్మచారితో పాటు అక్కడున్నవారిపై తేనెటీగలు దాడి చేశాయి. శరీరమంత తేనెటీగలు కుట్టడంతో అక్కడికక్కడే బ్రహ్మచారి మృతి చెందాడు. బ్రహ్మచారి చనిపోయినట్లు అక్కడే ఉంటున్న చిన్న కుమార్తె శ్రావికకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పెద్దకూతరు, అల్లుడు మంగళవారం టాంజానియాకు వెళ్లారు. రెండు, మూడు రోజుల్లో బ్రహ్మచారి మృతదేహం ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. బ్రహ్మచారి మృతితో ధర్మారావు పేటలో విషాదచాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications