Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Telangana: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు రూ.150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని తెలిసింది. దీని వల్ల ఆర్టీసీ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అభినందించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచన మేరకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. ఆ లక్ష్యంతోనే శనివారం నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి సారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా.. రేపు మొదటి దశలో 150 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండో దశలో మరో 450 బస్సులను అద్దె ప్రాతిపదికన మహిళా సమైక్య సంఘాలు ఆర్టీసీతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసారు.












Click it and Unblock the Notifications