ఆర్టీసీ ఉద్యోగులకు ఇక... ప్రభత్వం సంచలన నిర్ణయం..!!

తెలంగాణలో ఎట్టకేలకు ఆర్టీసీ సమ్మె ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం సుదీర్ఘంగా చేసిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ సమయంలో పలు కీలక అంశాల పైన ప్రభుత్వం నుంచి సాను కూల స్పందన వచ్చింది. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ.. ఫిట్‌మెంట్‌ పైన అంగీకారం కుదరటం తో పాటుగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మిగిలిన డిమాండ్ల పైన సానుకూలత రావటంతో.. సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రటకన చేసారు. అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు రాత్రి ప్రకటన చేసారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఉదయం 10 గంటలకు చర్చలు మొదలయ్యాయి. తొలుత అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. తర్వాత రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చాంబర్‌లో ప్రధాన చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాసేపు భోజన విరామం తీసుకుని, మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. కార్మికులు ముందుపెట్టిన 31 డిమాండ్లలో ప్రధానమైన మూడు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్యలు చేపడతామని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చింది.

తెలంగాణ నూతన డీజీపీ గా.. సీఎం రేవంత్ అనూహ్య ఎంపిక..!!
తెలంగాణ నూతన డీజీపీ గా.. సీఎం రేవంత్ అనూహ్య ఎంపిక..!!
telangana-rtc-strike-called-off-after-marathon-talks-lead-to-common-ground-between-govt-and-unions

ప్రభుత్వం హామీ.. సమ్మె విరమణ

కాగా, డిమాండ్లలో ప్రధాన మైన ఆర్టీసీ విలీనంపై జూన్‌ 2న ప్రకటన చేస్తామని పేర్కొంది. కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు పొందని యూనియన్ల (ట్రేడ్‌ యూనియన్ల)కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యూనియన్‌ నాయకులకు సూచించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 వేతన సవరణలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కార్మిక సంఘాలు 30 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం తొలుత 5శాతం ప్రతిపాదించింది. కానీ కనీసం 20శాతమైనా ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీనితో చాలాసేపు తర్జనభర్జన జరిగింది. చివరికి 10శాతం ఫిట్‌మెంట్‌పై సయోధ్య కుదిరింది. మొత్తంగా 28 డిమాండ్లను ప్రభుత్వం బేషరతుగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. సమ్మె కాలంలో కార్మికులపై నమోదైన కేసుల ఎత్తివేత విషయంలోనూ సానుకూలంగా స్పందించింది. దీంతో.. సమ్మె విరమణ పైన కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+