మమతా బెనర్జీని కలిసేందుకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం కోల్‌కతాకు బయలుదేరారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో జాతీయస్థాయిలో ఓ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా కేసీఆర్ తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications