చేవెళ్ల బస్సు ప్రమాదం.. రాష్ట్రంలో కొత్త రూల్స్.. వాళ్లకు దబిడిదిబిడే..
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాదం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ పెను విషాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలకు పాల్పడింది. అలాగే రవాణాశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిరంతరం ఉండేలా ప్రణాళిక రచించింది.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రవాణా శాఖలో నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించింది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కఠినతరం చేయడానికి సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు.. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు మినరల్ ట్రాన్స్ పోర్ట్ లో శాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంలో డీటీసీ ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లను వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే త్వరలో రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఎస్సే కాంపిటిషన్, ఎవేర్ నెస్ క్యాంపెయిన్, చిల్డ్రన్స్ అవేర్ నెస్ పార్కులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications