టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటివరకంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగిసింది. అయితే, తాజాగా, సెప్టెంబర్ 4వ వరకు ఆ గడువును పొడిగించినట్లు టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజా, దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేయాలనుకుంటే రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 10 వరకు, రూ. 2వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు దీనికి అదనం.

Telangana set application date extended to september 24

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. అర్హులైన https://online.telanganaset.org/TSSET23v1/ త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పరీక్షకు ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, విశాఖపట్నం, నల్గొండ, రంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

పేప‌ర్ 1లో 50 ప్ర‌శ్న‌ల‌కు 100 మార్కులు, పేప‌ర్ 2లో 100 ప్ర‌శ్న‌ల‌కు 200 మార్కులు కేటాయించ‌నున్నారు. ప‌రీక్ష కాల వ్య‌వ‌ధి మూడు గంట‌లు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సెట్ నోటిఫికేష‌న్‌తో పాటు మరింత స‌మాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+