మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క..!!

హైదరాబాదు:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) మరో భారీ శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ఖాతాల్లోకి రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,57,098 సంఘాల ఖాతాల్లో జమ చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పంచాయ‌తీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క ఈ నిధుల విడుదలపై సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్, జిల్లాల డిఆర్‌డిఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

telangana-shgs-get-304-cr-relief-interest-free-loans-credited-to-accounts-of-3-5-lakh-women-groups

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం:
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. "ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తాజాగా విడుదల చేసిన రూ. 304 కోట్లతో కలిపి ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ. 1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయి" అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలే కాకుండా, పట్టణ మహిళా సంఘాలకు కూడా సుమారు రూ. 300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీత‌క్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వ‌తంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

గత ప్రభుత్వ నిర్వాకంపై సీతక్క ఫైర్:
తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు. "గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన సుమారు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసింది. అంతేకాకుండా, మహిళలు కష్టపడి పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు" అని ఆమె విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పారదర్శకతతో, సకాలంలో నిధులను అందిస్తూ మహిళల ఆర్థిక శక్తిని పెంచడానికి కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+