ఏపీలానే తెలంగాణకు సాయం చేయాలి: శివరాజ్ సింగ్ కు రేవంత్ వినతి
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం
వరద ప్రభావానికి గురైన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. అనంతరం మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ సచివాలయానికి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సాధర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు సమీక్షించారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. సుమారు రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం రేవంత్ కేంద్రమంత్రి చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం రేవంత్ కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు.
आज तेलंगाना के खम्मम जिले के मुन्नेरू एवं कट्टलेरू सहित अन्य बाढ़ से प्रभावित क्षेत्रों का हवाई सर्वेक्षण किया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 6, 2024
संकट की इस घड़ी में केंद्र सरकार जनता के साथ खड़ी है। pic.twitter.com/ShwOFvieby
భారీ వర్షాలతో వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయని ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని.. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని సీఎం తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ చెప్పారు.
आज तेलंगाना के खम्मम जिले में फसलों के नुकसान का जायजा लिया।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 6, 2024
बाढ़ के कारण जो संकट किसानों पर आया है, उससे किसान भाई-बहनों को उबारने के लिए केंद्र सरकार हर संभव सहायता करेगी।
किसान साथियों, बाढ़ के कारण जो स्थिति निर्मित हुई है, वह अत्यंत भयावह है। किंतु आप निराश न हों, हिम्मत… pic.twitter.com/BKCZ8ZRwzZ
విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సచివాయలంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గురువారం ఏపీలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. శుక్రవారం తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పర్యటించారు. బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications