10ఫలితాలు విడుదల: జగిత్యాల ఫస్ట్, వనపర్తి లాస్ట్, ‘15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సచివాలయంలోని డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 84.15శాతం మంది విద్యార్థులయ్యారని చెప్పారు.

ఈసారి కూడా ఫలితాలలో విద్యార్థినులదే పైచేయి సాధించారు. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియా నుంచి 48శాతం మంది, ఇంగ్లీష్ మీడియం నుంచి 52శాతం మంది ఉన్నారు.

Telangana SSC Class 10 exams 2017: Results declared

పది పలితాల్లో 97.35ఉత్తీర్ణత శాతంతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 64.8శాతంతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా, 20ప్రైవేటు పాఠశాలలు, 5 ఎయిడెడ్ పాఠశాలలు, 3 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ఫలితాలు రావడం గమనార్హం.

2005 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణిత సాధించారు. కాగా, టెన్త్ ఫలితాల పాస్ వర్డ్ EDUCATION. జూన్ 5 నుంచి పదవ తరగతి అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

రాబోయే 15రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇక డీఎస్సీకి టెట్ అవసరం లేదని చెప్పారు. మళ్లీ టెట్ నిర్వహించమని స్పష్టం చేశారు. టీచర్ల బదిలీలు ఇప్పట్లో ఉండవన్నారు.

మొత్తం 8792పోస్టులు

రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. గతంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన సుమన్‌, పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆంజనేయగౌడ్‌ తదితరులు ఈ రోజు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి పలు అంశాలపై చర్చించారు. పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువత ఆశలతో ఉన్నారని, ప్రకటన విడుదల చేయాలని ఆయనను ఇప్పటికే కలిసినట్టు చెప్పారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. మొత్తం 8792 ఉద్యోగాలతో పక్షం రోజుల్లోనే డీఎస్సీ ప్రకటన విడుదలవుతుందని, జూనియర్‌, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పోస్టుల భర్తీ కూడా చేపడతారని సుమన్‌ తెలిపారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Board of Secondary Education (BSE) has declared the results for the Senior Secondary Certificate (SSC) class 10 examinations at bse.telangana.gov.in

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి