తెలంగాణ ది బెస్ట్, 3 అవార్డులు: వారసత్వ నగరంగా వరంగల్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి మూడు జాతీయ స్థాయి పర్యాటక అవార్డులు లభించాయి. 2014-15లో పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషి జరిపినందుకు ఇవి వచ్చాయి. ఉత్తమ వారసత్వనగరం విభాగంలో మన వరంగల్ ఎంపికైంది.
అంతర్జాతీయ స్థాయి సమావేశాల నిర్వహణలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కు పురస్కారం దక్కింది. పర్యాటక ప్రచారం నిమిత్తం కాఫీ టేబుల్ బుక్ తరహాలో తెలంగాణ ప్రాచీన ఆలయాలు పేరిట ప్రచురించిన పుస్తకానికి మూడో అవార్డు లభించింది.

తెలంగాణకు జాతీయ అవార్డు
శనివారం నిర్వహించిన 'జాతీయ పర్యాటక పురస్కారాలు 2014-15' కార్యక్రమంలో లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి మహేశ్ శర్మ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ ఎండీ క్రిస్టీనా చోంగ్తు, కన్వెన్షన్ సెంటర్ సీఈవో వరుణ్ అరోరాలు అవార్డులను అందుకున్నారు.

తెలంగాణకు జాతీయ అవార్డు
మరోవైపు సమగ్ర పర్యాటకాభివృద్ధిలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలువగా, గుజరాత్, కర్ణాటకలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్‌కు 'అత్యుత్తమ పర్యాటకహిత రైల్వేస్టేషన్' అవార్డు అందుకుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయ అవార్డు దక్కించుకుంది.

తెలంగాణకు జాతీయ అవార్డు
అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ.. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక శాతం పర్యాటకులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. 2025 నాటికి దాన్ని రెండు శాతానికి పెంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపాధి, విదేశీ మారక నిల్వలు పెంచే పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారన్నారు.

తెలంగాణకు జాతీయ అవార్డు
తెలంగాణకు మూడు జాతీయ పర్యాటక పురస్కారాలు రావడం సంతోషంగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్థి చేసేందుకు కృషి చేస్తున్నామని, సాంస్కృతికంగా తెలంగాణ వైపు ప్రపంచ దేశాలు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రానున్న అయిదేళ్లలో భారతదేశాన్ని ఒక నగరంలా చూడాలంటే హైదరాబాద్, రాష్ట్రంగా చూడాలంటే తెలంగాణకు రండి అనే నినాదంతో పని చేస్తున్నామన్నారు.

తెలంగాణకు జాతీయ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విదేశీ పర్యాటకుల సందర్శన పెరిగిందని, 2012-14 మధ్యకాలంలో ప్రతి ఏటా సగటున అరవై వేల మంది సందర్శిస్తే 2014-15లో ఇది 1.25 లక్షలకు పెరిగిందని బుర్రా వెంకటేశం చెప్పారు. 2020 కల్లా ఈ సంఖ్యను పది లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పర్యాటక రంగంలో తెలంగాణ ది బెస్ట్ అన్నారు.

తెలంగాణకు జాతీయ అవార్డు
ఈసారి బతుకమ్మ సంబురాలకు 35 దేశాల నుంచి కళాకారులు, సాహితీ విమర్శకులు, పాత్రికేయులు వస్తున్నారని వివరించారు. హాంకాంగ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆ దేశ కళాకారులు మన బతుకమ్మ సంబురాల్లోని సంప్రదాయాన్ని అధ్యయనం చేసేందుకు వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అవార్డులు వచ్చినా మనకంటూ రాష్ట్రం వచ్చిన తొలిఏడాదే మూడు అవార్డులు రావటానికి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రత్యేక కృషి కారణమన్నారు.












Click it and Unblock the Notifications