జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితులను విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు.
కాగా, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనను... తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలికి మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు.

మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు
జూబ్లీహిల్స్‌లో అత్యాచార ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం బాధిత బాలిక స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడిని చేర్చనున్నట్లు తెలిపారు. అత్యాచార ఘటనలో ఎమ్మెల్యే కుమారుడిపై పెట్టనున్న కేసుపై సందిగ్ధత నెలకొంది. నిందితులు ఉపయోగించిన బెంజ్ కారులో క్లూస్ టీం ఆధ్వర్యంలో బాలిక చెవి కమ్మ, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యాన్ని (స్పెర్మ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మే నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్ నుంచి బాలిక బయటకు వచ్చింది.అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది.
బెంజికారులో ప్రముుఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. అయితే, నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు నిందితులు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.అనంతరం బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.
అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు.. అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫిర్యాదుతో దాదాపు వారం తర్వాత ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications