నేటి నుంచే మేడారం జాతర - వనదేవతల ఆగమనం : కోటిన్నార మంది దర్శనం..!!

మేడారం జాతరకు సమయం ఆసన్నమైంది. వనదేవతల ఆగమనానికి సర్వం సిద్దమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. వన దేవతలు జనం నడుమ మొక్కులందుకోనున్నారు.ఈ రోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు. లక్షలాది మంది తరలి వచ్చే జాతరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపుల 45 వేల మంది సిబ్బందిని ఏర్పాట్ల కోసం వినియోగించింది. ఇప్పటికే మేడారం ప్రాంతం మొత్తం ప్రత్యేక ఏర్పాట్లతో సిద్దమైంది.

నాలుగు రోజుల జాతర

నాలుగు రోజుల జాతర

మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం జాతర ప్రారంభమై.. శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా వేస్తున్నారు. మంగళవారం మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు. గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలతో సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు. 24 గంటలపాటు పాదయాత్ర సాగాక బుధవారం పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకుంటారు.

నేటి సాయంత్రం నుంచి మొదలు

నేటి సాయంత్రం నుంచి మొదలు

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వారిని యథా స్థానానికి తరలిస్తారు. జాతర ప్రాంగణంలో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వరంగల్‌ నుంచి వచ్చే ప్రధాన రహదారిని విస్తరించారు. నాలుగు వేల ఆర్టీసీ బస్సులు సహా దాదాపు 50 లక్షల వాహనాలు జాతరకు వచ్చే వీలుంది. భక్తుల కోసం 327 ప్రాంతాల్లో 20వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గోదావరికి ఉపనది అయిన జంపన్న వాగు జాతరలో పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందింది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు

32 ఎకరాల్లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. మాస్క్‌లతో పాటు శానిటైజర్లను సైతం పంపిణీ చేస్తోంది. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మేడారంలో జాతర సందర్భంగా 11 వేల మంది పోలీసులతో గట్టి భద్రత కల్పిస్తున్నారు. అర కిలోమీటరుకు ఒక పోలీసు అవుట్‌పోస్ట్‌ ఉంది. వీటితో ప్రభుత్వ కంట్రోల్‌రూమ్‌లను అనుసంధానం చేశారు. సీఎం కేసీఆర్‌భక్తులను ఇంటి అతిథుల్లా భావించి, సేవలందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+