ఎరుకల సమాజానికి కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా, కుటుంబానికి భరోసాగా ఆర్థికపరమైన పలు పథకాలను ఇప్పటికే తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, దళితుల సంక్షేమం కోసం దళితబంధు, బీసీ కులవృత్తుల కోసం బీసీ బంధును అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
తాజాగా, ఎరుకల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. ట్రైకార్ ద్వారా సాధికారత పథకాన్ని అమలు చేయనున్నది. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పందుల పెంపకం, స్లాటర్ హౌస్, కోల్డ్ స్టోరేజీలకు, రవాణా, ఫోర్క్ రిటైల్ మార్కెట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం చేయనుంది. యూనిట్‌కు గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు 50శాతం రాయితీ ఇవ్వనుంది. 40శాతం బ్యాంకు రుణం, మరో పదిశాతం 10 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. పథకం మంజూరు కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ పని చేయనుండగా.. ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ రాష్ట్రస్థాయిలో పథకం అమలును పర్యవేక్షించనుంది.
తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటు
తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రైమరీ ఉత్తర్వులు జారీ చేసింది. పైరమూర్, తాండ్రా, వైకుంఠాపూర్, బీరవెల్లి, కంకట, వంజార్, చించోలి(ఎం), జ్వెలి, కల్వ గ్రామాలతో కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయనుంది. మొన్నటి వరకు ఆయా గ్రామాల్లన్నీ సారంగాపూర్ మండలాల్లో కొనసాగుతుండగా.. కల్వ గ్రామం మాత్రం దిలావర్‌పూర్ మండలంగా కొనసాగుతోంది. బీరవెల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications