గణతంత్ర వేడుకల రిహార్సల్స్‌లో టి శకటం(ఫొటో)
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు దేశ రాజధానిలో వేగంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి శకటాన్ని ప్రదర్శించే అవకాశం లభించింది. రాజ్‌పథ్‌లో జరిగే ప్రదర్శనలో మొత్తం 25 శకటాలు పాలుపంచుకోనున్నాయి.

అందులో 16 శకటాలు రాష్ర్టాలకు చెందినవి కాగా, మిగితావి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి. ఢిల్లీ కంటోన్మెంట్‌లో శకటాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే రాజ్‌పథ్ రోడ్డుపై డమ్మీ రిహార్సల్స్‌ను నిర్వహించిన రక్షణశాఖ శుక్రవారం మరోమారు పూర్తిస్థాయి శకటాలతో రిహార్సల్స్‌ను నిర్వహించింది.
ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రదర్శించనున్న బోనాలు పండుగ థీమ్‌ను శకటాన్ని చూడాలన్న ఆసక్తి అందరిలో నెలకొన్నదని రక్షణశాఖ అధికార ప్రతినిధి ధనుంజయ్ మహంతి తెలిపారు.












Click it and Unblock the Notifications