చంద్రబాబుపై చిల్లర రాజకీయాలు: కెసిఆర్‌పై టిడిపి
హైదరాబాద్: కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చిల్ల రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ నేతలు విమర్శించారు. టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి శనివారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కెసిఆర్ సఖ్యతతో ఉండాలని వారు సూచించారు.
శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం వివాదంపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని, తమ ఢిల్లీ యాత్ర విజయవంతమైందని వారు చెప్పారు.
కెసిఆర్ వైఖరితో నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనని వారన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులందరినీ కలిశామని వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు నిర్దిష్ట ప్రతిపాదనలు వచ్చాయి గానీ తెలంగాణ నుంచిమాత్రం ప్రతిపాదనలేవీ రావడం లేనది సాక్షాత్తు కేంద్ర మంత్రులే అంటున్నారని వారు చెప్పారు. ఇప్పటికైనా కెసిఆర్ మేల్కోవాలని వారు కెసిఆర్‌కు హితవు చెప్పారు.

దేశద్రోహుల్లా కెసిఆర్ కుటుంబ సభ్యులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దేశ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుమార్తె కవిత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ సర్దార్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొనకుండా తప్పించుకున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణకు విముక్తి కలిగించిన పటేల్‌కు నివాళి అర్పించే తీరిక కూడా కేసీఆర్‌కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతోందని నాగం మండిపడ్డారు. ఈ తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications