శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ కోసం మోకాళ్లపై మోత్కుపల్లి!
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.
తన కుమార్తె వివాహం డిసెంబర్ 20వ తేదీన జరుగుతుందని, అందువల్ల కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చామన్నారు. వివాహ తొలి ఆహ్వాన పత్రికను స్వామివారి పాదాలకు సమర్పించామన్నారు.

కేసీఆర్ కోసం మోకాళ్లపై మోత్కుపల్లి!
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం యాదగిరిగుట్ల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆలయ ప్రాంగణంలో మోకాళ్లపై కూర్చున్న ఆయన యాదగిరీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. నేలపై తెలుపు రంగులో ఉన్న ఓ మెత్తటి వస్త్రాన్ని పరిచి దానిపై మోత్కుపల్లి మోకాళ్లపై కూర్చుని తన కోరికను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ మొక్కు మొక్కుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు మార్చాలని ఆయన స్వామిని కోరుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్ట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసేలా కేసీఆర్ కు బుద్ధి ప్రసాదించాలని మోత్కుపల్లి స్వామివారిని వేడుకున్నారు.












Click it and Unblock the Notifications