New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ అప్పుడే.. !'
New Ration Cards: ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి చర్చ నడుస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నూతనంగా దరఖాస్తులు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో మీ-సేవా కేంద్రాలకు ప్రజలకు జనం క్యూ కడుతున్నారు. గత రెండ్రోజుల నుంచి మీ-సేవా కేంద్రాల దగ్గర రద్దీ నెలకొంటోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా జాబితాలో తమ పేర్లు రాలేదని మీ-సేవా కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఇక ఇప్పట్లో నూతన రేషన్ కార్డులు లేనట్లేనని తెలుస్తోంది. ఈ అప్ డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం తెలంగాణలోని మీ-సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ.. ఎన్నికల తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. రెండు నియోజకవర్గాల (ఎమ్మెల్సీలు) సభ్యుల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ముగిసిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని.. ఇది నిరంతర ప్రక్రియయ అని.. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను జారీ చేస్తామని అంటున్నారు.

ప్రజాపాలన, ప్రజావాణి సమయంలో దరఖాస్తులు ఇచ్చిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్ చేయబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 6.68 లక్షల నిరుపేద కుటుంబాలను కొత్త రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించింది. వీరి జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులకు పంపారు. ఆ కుటుంబాల జాబితాలో 11,65,052 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. జనవరి 20 నుంచి 24 వరకు అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం గ్రామ, బస్తీ సభలను నిర్వహించింది. అ తర్వాత జనవరి 26న రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications