తెలంగాణలో తప్పక చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. డోంట్ మిస్..!

తెలంగాణ ప్రాంతానికి గణనీయమైన చరిత్ర ఉంది. తెలంగాణలో ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. శాతవాహనులు, కాకతీయుల కాలం నుంచి తెలంగాణ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా ఉంది. ఆ తర్వాత కుతుబ్ షాహీలు, నిజాం రాజుల కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధించింది. అయితే తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉండగా వాటిని సందర్శించేందుకు టూరిస్టులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. వాటిలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న చార్మినార్, గోల్కొండ కోట తొలి ప్లేస్ లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని ప్రాచీనమైన కట్టడాల్లో చార్మినార్ ఒకటి. చార్మినార్ కు ఈజీగా ఆటోలో బస్సులో చేరుకోవచ్చు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సదుపాయం ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇక్కడి నైట్ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సమయంలో ఇక్కడకు వెళ్లడం బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గా భావిస్తుంటారు.

దాంతోపాటు హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని చాటిచెప్పే మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం గోల్కొండ కోట. ఈ కోట నిర్మాణ శైలి ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. గోల్కొండ కోట హైదరాబాద్ కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కోట చుట్టూ దాదాపు 10 కిలోమీటర్ల పొడవైన గోడ, 87 బురుజులు అలాగే 8 ప్రధాన ద్వారాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. ఇక్కడకు సమీపంలో కుతుబ్ షాహీ టోంబ్స్ అనే మరో చారిత్రక ప్రదేశం కూడా ఉంది. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నగర వాసులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ, బోటింగ్, నీటి మధ్యలో ఎత్తయిన బుద్ధుని విగ్రహం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ అయిన రామోజీ ఫిల్మ్ సిటీ సినిమా ప్రేమికులకు బిగ్గెస్ట్ డెస్టినేషన్ అని తెలిసిందే. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి పర్యటకులకు కలుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా సెట్స్, షూటింగ్ లు, పచ్చని గార్డెన్స్ తో పాటు రకరకాల షోలు టూరిస్టులను విశేషంగా అలరిస్తుంటాయి. ఇక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ కు అనువైన సమయంగా చెబుతారు. అలాగే చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్ నుమా ప్యాలెస్, పురానా హవేలీ కూడా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి.

Telangana tourism These are the famous tourist places in Telangana Must see at least once in life

మరోవైపు ములుగు జిల్లాలోని పాలంపేటలో రామప్ప ఆలయానికి గణనీయమైన చరిత్ర ఉంది. 1213 లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ గా ఈ ప్రాంతం గుర్తింపు దక్కించుకుంది. ఈ ఆలయం వరంగల్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక మీరూ ఈ టూరిస్టు ప్రాంతాలను ఒక్కసారైనా విజిట్ చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+