కరోనా బారిన పడ్డ తెలంగాణ మంత్రి: హోమ్ ఐసొలేషన్: ఫోన్లు చేయొద్దు..ఎవరూ కలవొద్దు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖ పడుతోన్న వేళ.. కొందరు ప్రముఖులు వాటి బారిన పడుతూనే ఉన్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు శాసన సభ, లోక్‌సభ సభ్యులు కరోనా బారిన పడి కోలుకున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాజాగా- టీఆర్ఎస్ నేత, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Recommended Video

    #corona తెలంగాణ: కరోనా బారినపడ్డ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

    తాను ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేయించుకోగా.. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. దీనితో తాను హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారుల వెంటనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుజాగ్తత్త చర్యలను తీసుకోవాలని అన్నారు.

    Telangana Transport minister Puvvada Ajay Kumar has tested positive for Covid19

    హోమ్ ఐసొలేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నందున. ఎవరూ తనకు ఫోన్లు చేయొద్దని మంత్రి పువ్వాడ అన్నారు. తనను కలుసుకునే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పారు. త్వరలోనే తాను కోలుకుంటానని, మళ్లీ యధావిధిగా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను విస్తృతంగా కలుసుకొంటున్నారు. తన సొంత జిల్లా ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

    తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిందే తప్ప.. పూర్తిగా మటుమాయం కావట్లేదు. కరోనా దూకుడుకు బ్రేకులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ీసుకుంవైద్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 491 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 596 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 2,78,599కు చేరుకున్నాయి. ఇందులో 2,69,828 మంది డిశ్చార్జి అయ్యారు. 1499 మంది మృతి చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+