నేను లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, నేను చెప్తేనే మహాతల్లి నిర్ణయం: జైపాల్ రెడ్డి
మహబూబ్‌నగర్: గత యుపిఎ ప్రభుత్వంలో తాను కేంద్ర మంత్రిగా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను నచ్చజెప్పానని, దాంతోనే తెలంగాణపై ఆ మహాతల్లి నిర్ణయం తీసుకున్నారనే విషయం తనకు తెలుసని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి వెల్లడించారు.
సోమవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులను రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చేపట్టిన ధర్నాకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సందర్భంలో తనతో పాటు సోనియాగాంధీ దగ్గరకు వెళ్లినప్పుడు తెలంగాణ వచ్చాక సిఎంగా నీవే ఉండాలని చెప్పారని, అయితే అందుకు తాను ముందు టిఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పానని వెల్లడించారు.

రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులను అవలంభిస్తోందని ఆరోపించారు. కెసిఆర్ సిఎంగా ప్రమాణఁ చేసినప్పటి నుండి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పరిపాలన తొందరపాటు నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు ప్రజల నుండి తిరుగుబాటు, దాంతో తోక ముడుచుకుని తిరోగమనం పడుతున్నారని అన్నారు.
కెసిఆర్‌కు తెలివి ఎంత ఉందో తిక్క కూడా అంత ఉందని విమర్శించారు. సెక్రటరీయేట్‌లో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, మంత్రివర్గ సమావేశాలు జరిగితే ఏ ఒక్కరిని కూడా మాట్లానివ్వకుండా గంటల తరబడి సిఎం ఒక్కరే మాట్లాడుతూ తానే విజ్ఞాన సరస్వం ఉన్న వాడినని అనుకుంటాడని, అది అధికార అహంకారం, దురంకారంతో కూడిన ప్రవర్తన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ ఏ విధంగా అహంకారంగా వ్యవహరిస్తున్నారో అది అంటువ్యాధిగా మారి టిఆర్‌ఎస్ నాయకులందరికీ వ్యాపించిందని దుయ్యబట్టారు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి కరువు దుర్భిక్షం చూడలేదని, 1969లో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పటివరకు ఇలాం టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏనాడూ చూడలేదని వ్యాఖ్యా నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతులు అంటే చిన్నచూపు అని, అందుకే ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదంటే ఎంత అహంకారం ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని జైపాల్‌రెడ్డి అన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications