రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రేపు సభలో అడుగుపెట్టనున్న కేసీఆర్..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడీవేడిగా సాగనున్నట్లు స్పష్టం అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి(డిసెంబర్ 29, సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జనవరి మొదటివారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈమేరకు తాజాగా అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటివరకూ కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా.. రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు.. తదితర కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, రెండేళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అలాగే అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. నీటి కేటాయింపులు విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ విషయంపై రాష్ట్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసి ఆ సభల వేదికగా దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications