కవితపై అనుచిత వ్యాఖ్యలు: బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. కేసును సుమోటాగా విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డీజీపీని గతంలోనే కమిషన్ ఆదేశించింది. అయితే, తాజాగా, బండి సంజయ్ (Bandi Sanjay)కి వ్యక్తిగతంగా మమిళా కమిషన్ నోటీసులు పంపింది.

లిక్కర్ స్కాం కేసులో కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు అందజేసిన సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. క్షమాపణలు చెప్పకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.
పలు చోట్ల బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్‌పై ఫిర్యాదులు చేశారు. మరోవైపు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కవితపై అలాంటి వ్యాఖ్యలు చేసివుండాల్సి కాదన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను సంజయ్ వెనక్కి తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications